
గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ అన్న పేరుగాని పెట్టుబడి అన్న పదం కానీ మచ్చుకైనా వినిపించలేదంటే అతిశయోక్తి కాదేమో. నాడు నవరత్నాల అమలే జగన్ లక్ష్యం అన్నట్టుగా సాగిన వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయారు.
2024 ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ అండ్ కో తమ పాలనలో నొక్కిన బటన్ల గురించి, పంచిన ఉచితాల గురించి మాత్రమే చెప్పి ప్రజలను ఓట్లడిగారు. నాడు ఎప్పుడు కూడా మా హయాంలో రాష్ట్రంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు అని కానీ, క్వాంటం వ్యాలీ నిర్మాణం అని కానీ, భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి అని కానీ చెప్పలేని వైసీపీ ఇప్పుడు మాత్రం క్రిడిట్ ల కోసం ఆరాటపడడం హాస్యాస్పదం.
కానీ నేడు కుటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు డేటా సెంటర్ ను తీసుకురాగలిగింది, అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది, ఇక భోగాపురం ఎయిర్ ఫోర్ట్ నిర్మాణ పనులను పూర్తి చేసి రేపు వేసవి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
అయితే నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటి పై కనీసం నోరు విప్పని జగన్ అండ్ కో నేడు అవి ప్రజల చేత ప్రశంసలు పొందడంతో బాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, అవన్నీ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రానికి తరలి వచ్చాయని, ఆ క్రెడిట్ మొత్తం వైసీపీ కే చెందాలి, జగన్ కే దక్కాలి అంటూ పార్టీ అధినేత జగన్ నుంచి కార్యకర్త వరకు, అలాగే సాక్షి నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు గగ్గోలు పెట్టేస్తున్నాయి.
ఇక నేడు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సుమారు 1.35 కోట్ల భారీ పెట్టుబడి తో ఆర్స్ లార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి కుమార్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఐటీ మంత్రి లోకేష్, హోమ్ మంత్రి అనిత పాల్గొన్నారు.
ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 2029 నాటికి ఉత్పత్తి ప్రారభించి 2033 నాటికి పనులు పూర్తి చేసే లక్ష్యంతో నేడు శంకుస్థాపన జరుపుకుంటుంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు క్రెడిట్ కూడా జగన్ ఖాతాలో వేసుకునేందుకు సాక్షి, వైసీపీ సోషల్ మీడియా ఇక రేపటి నుంచి విశ్వప్రయత్నాలు మొదలుపెడుతుంది.
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…