Telugu

డిస్కౌంట్లతో ఆప్కోని బ్రతికించుకోగలరా?

పర్యాటక శాఖలా చాలా నిరాధరణకు గురవుతున్న మరోశాఖ చేనేత. ఇంతకాలం ప్రభుత్వాలు పర్యాటక శాఖని పట్టించుకోనట్లే చేనేతని కూడా పట్టించుకోలేదు. అందువల్లే చేనేత అంటే టక్కున గుర్తొచ్చే ‘ఆప్కో’ కూడా ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది.

ఒకప్పుడు ప్రతీ ఊరులో ఆప్కో దుకాణాలు కనిపించేవి. కొనుగోలుదారులతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆప్కో దుకాణాలు ఎక్కడున్నాయి? అసలు ఎక్కడైనా ఉన్నాయా లేవా?అని వెతుకునే పరిస్థితి.

ADVERTISEMENT

చేనేతకు ప్రభుత్వ మద్దతు కొరవడటంతో మగ్గం చప్పుళ్ళు తగ్గిపోతున్నాయి. చేనేత బట్టలకు అనేక ఆకర్షనీయమైన ప్రత్యామ్నాయాలు మార్కెట్లో తక్కువ ధరలలో అందుబాటులో ఉండటం, ఇదే సమయంలో వివిధ కారణాల వలన చేనేత బట్టల ధరలు ఎక్కువగా ఉండటం వలన క్రమంగా ఆప్కో దుకాణాలు నష్టాలలో కూరుకుపోయి ఒకటొకటిగా మూత పడుతున్నాయి. ఇప్పుడు చేనేత అంటే చీరలు మాత్రమే అనుకునే పరిస్థితికి చేరుకుంది. వాటి కోసం కూడా ఎవరూ ఆప్కో దుకాణాలకు వెళ్ళరు. ఎక్కడికక్కడ అనేక ప్రైవేట్ వస్త్ర వ్యాపార సంస్థలు, వాటిలో ప్రైవేట్, బ్రాండెడ్ కంపెనీల బట్టలు లభిస్తున్నాయి. చివరికి ఆన్‌లైన్‌లో కూడా బట్టలు కొనుగోలుచేసే వెసులుబాటు వచ్చేసింది.

అయినప్పటికీ తమిళనాడులో తయారయ్యే చేనేత బట్టలను ‘కో ఆప్టేక్స్’ జోరుగా అమ్ముకోగలుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధ్వర్యంలో మద్యం దుకాణాలు కూడా లాభాలలోనే సాగాయి.

కానీ ఏపీలో తయారవుతున్న చేనేత వస్త్రాలను ఆప్కో అమ్ముకోలేకపోతోంది… ఎందుకు?ఆప్కోకి ప్రజలు ఎందుకు రావడం లేదు?అప్కోలో చేనేత బట్టలు కొనడానికి ప్రజలు ఎందుకు ఇష్టపడటం లేదు?అని చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత, ఆప్కో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ‘బతుకమ్మ చీరల’ పధకం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ ఏటా బతుకమ్మ పండగకు రెండేసి చొప్పున కోటికి పైగా చీరలు పంచిపెట్టేది. ఈ చీరలు నేసే బాధ్యత రాష్ట్రంలో చేనేత కార్మికులకు అప్పగించింది. దీని వలన వారికి ఏడాది పొడవునా పని, నెలకు ఇంత ఆదాయం ఉండేది. ఆరోగ్యశ్రీ, సూపర్ సిక్స్ వంటి పధకాలను దిగుమతి చేసుకొని అమలుచేస్తున్న ప్రభుత్వం, ఈ పధకాన్ని మాత్రం అమలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు!

అలాగని రాష్ట్రంలో చేనేత రంగాన్ని దానిపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు లక్షమందిని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు ఏవీ జరిగిన దాఖలాలు లేవు. చేనేత రంగాన్ని కాపాడుకుంటూనే దానికి ప్రధాన మార్కెటింగ్ అవుట్ లెట్‌గా నిలుస్తున్న ‘ఆప్కో’ని కాపాడుకోవడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేయాలి. కానీ ఆప్కో అంటే అధికార పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు డైరెక్టర్ ఉద్యోగాలు కల్పించేందుకు మాత్రమే అన్నట్లు మిగిలిపోయింది.

ఇప్పుడు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. కానీ రాష్ట్రంలో బట్టల దుకాణాలన్నీ కూడా 10-20 శాతం పండగ డిస్కౌంట్లు ప్రకటిస్తే అవన్నీ కిటకిటలాడుతున్నాయి. కానీ 40 శాతం డిస్కౌంట్ ఇచ్చినా ఆప్కో దుకాణాలు వెలవెలపోతున్నాయి… ఎందువల్ల? మంత్రి సవిత, ఆప్కో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ప్రజలు చేనేత బట్టలు కొనకపోవడానికి కారణం ధరలు మాత్రమే కాదు. డిజైన్, నాణ్యత, ఆధునికత, మార్కెటింగ్ అన్నీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆప్కోకు ఎన్ని డిస్కౌంట్‌లు ఇచ్చినా ప్రాణం పోసుకోవడం కష్టమే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

14 minutes ago

Shocking Navratri Trend: IV Drips for Gen Z Wild Nights

Ahmedabad’s Navratri celebrations are known for late nights, hours of energetic Garba and elaborate outfits,…

30 minutes ago