Telugu

మా సొమ్ము ప్రభుత్వం వాడేసుకొంటోంది… ఇదేం సిత్రమో!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మంత్రుల ఉపసంఘంతో చేసిన చర్చలన్నీ ‘ఛాయ్-బిస్కట్’ చర్చలే అని వాటి వలన ఎటువంటి ప్రయోజనమూ లేదని ఇదివరకే చెప్పేశారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ముందే హెచ్చరించారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో బుదవారం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

ముందుగా ప్రకటించిన ప్రకారమే ఏప్రిల్ 5 నుంచి 29వరకు వివిద దశలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 5 నుంచి ఉద్యోగులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని చెప్పారు. ఏప్రిల్ 8న ఉద్యోగులందరూ నల్లకండువాలు ధరించి, తమ డిమాండ్లను వివరించే పోస్టర్స్ ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10న నల్ల మాస్కులు ధరించి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తారు. ఏప్రిల్ 11న తమ సెల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్స్ వినియోగించడం నిలిపివేస్తారు. ఏప్రిల్ 12న భోజన విరామ సమయంలో అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నా చేస్తారు. ఏప్రిల్ 20న బ్యాంకర్లను కలిసి జీతాల చెల్లింపులో జరుగుతున్నా ఆలస్యం గురించి చర్చించి, వారికి తమ పరిస్థితి వివరించి ఇళ్ళు, వాహనాలు, వ్యక్తిగత రుణాల నెలవారి వాయిదాలు, జరిమానాలు వేసి తమపై ఒత్తిడి చేయవద్దని కోరుతారు. మే మొదటివారంలో విశాఖ, ఏలూరు, నెల్లూరు, అనంతపురంలో ఉద్యోగులు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించుకొని తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే మే నెలలో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంలో చేపడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.

ADVERTISEMENT

బొప్పరాజు వెంకటేశ్వర్లు తన సహచరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం మాకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోగా, గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ఉద్యోగుల చెల్లిస్తున్న సొమ్మును కూడా తీసి వాడేసుకొంటోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రతీనెల ప్రభుత్వం ఉద్యోగుల నుంచి డబ్బులు కట్ చేసుకొంటోంది కానీ వాటిని మా ఖాతాలలో జమా చేయడం లేదు. ఏమని అడిగితే ప్రభుత్వం బకాయిలన్నీ చెల్లించేసిందని చెపుతున్నారు. కానీ మేము రికార్డులు తీసి చూస్తే కొందరికి మూడు, మరికొందరికి నాలుగు నెలలు మాత్రమే జమా చేస్తూ మిగిలిన 7-8 నెలల సొమ్ముని ప్రభుత్వం వాడేసుకొంది. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? దేనికి వాడుకొన్నారు? ఎప్పుడు తిరిగి ఇస్తారు?అయినా మా జీతాలలో కోసుకొని దానిని ప్రభుత్వం వాడుకోవడం ఏమిటి?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Sound Issue: Makers Ask Theatres to Turn It Up

Ranabaali has been facing criticism over its background score since its release. Starring Vijay Deverakonda…

8 minutes ago

స్థానిక పరీక్షలు అందరికీ.. మినహాయింపుల్లేవు గురూ!

స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్ధులకే పరిమితం అనుకునే రోజులు కావివి. ఈ చెత్త…

12 minutes ago