
APPSC Recruitment 2026: 1,466 Government Jobs Announced
జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని పాలించినవారికి డీఎస్సీ-ఏపీపీఎస్సీల మధ్య ఇంకా తేడా తెలియక తికమక పడుతున్నారు. వాటి మధ్య తేడా తెలియకపోయినా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు చేయించారు. మంచిదే!
కానీ డీఎస్సీ అవకతవకలపై చివరి వరకు పోరాడుతామని చెప్పిన వైసీపీ, ఇప్పుడు ఆ ఆందోళనలను పక్కన పడేసి స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో పడింది!
కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంత హడావుడిలో జాబ్ క్యాలండర్ మరిచిపోలేదు. దాని ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేయడం మర్చిపోలేదు!
కనుక ఏపీపీఎస్సీ ఒకేసారి 1,466 ఉద్యోగాల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
ఏపీపీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ శశిధర్ మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే అన్నిటికీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. గ్రూప్-2 ఉద్యోగాలకు నవంబర్ 9న నోటిఫికేషన్లు విడుదల చేస్తాం.
వాటిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు తదితర వివరాలు తెలియజేస్తాం. నాన్-యూనీఫారం ఉద్యోగాలకు జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్ళ లోపు ఉన్నవారు అర్హులు,’ అని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించేందుకు వైసీపీ కోర్టుకు వెళ్ళి విఫలయత్నాలు చేసింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇలా నోటిఫికేషన్లు విడుదల చేయడం యువతను ప్రలోభపెట్టడమే అని వాదిస్తూ, వీటిని నిలిపివేయాలని కోర్టుకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.
Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…
Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…