ట్రంప్ విధానాలు మోడీ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నాయా.?

పదిహేనేళ్లపాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధానిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాల వలన దేశంలో తన క్రెజ్ పోగొట్టుకుంటున్నారా.?

ట్రంప్ టారీఫ్ల తో మొదలైన ఈ వివాదాలు ఆపరేషన్ సింధూర్ నిలిపివేత ప్రకటనతో మోడీ ఇమేజ్ ను మరోఅడుగు కిందకు లాగింది. ఇక రష్యాతో భారత్ చమురు విక్రయాల మీద ట్రంప్ విధించిన ఆంక్షలు, ఇస్తున్న మినహాయింపులతో ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మ అనే ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కుంటున్నారు.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు ఒమెన్ లో భారత నౌక పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన దేశ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమెరికా దాడిలో మృతి చెందిన భారత నావికుడి మృతదేహం కుళ్ళిపోతుందని, ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించలేదని, నౌక కెప్టెన్ వీడియో రిలీజ్ చేసారు.

అయితే రాహుల్ ఆ వీడియో ను తన X లో పోస్ట్ చేస్తూ రాజీపడిన ప్రధాని పాలనలో భారతీయుడిగా ఉండడం దుర్భరం అని, విదేశీ శక్తులు మన దేశ పౌరులను అన్యాయంగా చంపుతున్నా ఎన్డీయే ప్రభుత్వం కొందరి ఆజ్ఞలతో మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండిపోవడం దురదృష్టకరమంటూ మండిపడ్డారు.

అయితే రాహుల్ విమర్శలను రాజకీయ కోణంలో కాకుండా బాధితుల కోణంలో పరిగణలోకి తీసుకుంటే రాహుల్ వాదనకు బలం చేకూరుతుంది. ఒక భారత సంతతికి చెందిన పౌరుడు అమెరికా జరిపిన దాడులలో ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ మృత దేహాన్ని సక్రమంగా వారి కుటుంబాలకు అప్పగించడం ప్రభుత్వం విధి.

మోడీ సర్కార్ ఆ పనిని సజావుగా పూర్తి చేసి, తన దేశ పౌరుడు పట్ల అమెరికా అనుసరించిన విధానం పై కూడా బలంగా గళమెత్తాలి. లేకుంటే నేడు అమెరికా స్థానంలో రేపు మరో దేశం ఇటువంటి చర్యలకు సాహసించే ప్రమాదం ఉంటుంది.

గతంలో కూడా భారత ప్రభుత్వ తీసుకోబోతున్న కొన్ని నిర్ణయాలను, తీసుకోవాల్సిన మరికొన్ని నిర్ణయాలను ట్రంప్ తన ట్రూత్ ద్వారా ప్రకటించడం కూడా రాహుల్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వం ప్రకటించాల్సిన సీజ్ ఫెయిర్ నిర్ణయాన్ని మోడీ కంటే కూడా ముందే ట్రూత్ లో ట్రంప్ ప్రకటించారు.

అలాగే పాక్ – భారత్ యుద్దాన్ని టారిఫ్ ల మోత అడ్డుపెట్టుకుని తానే ఆపేసానని ట్రంప్ చేసిన ప్రకటనలతో ట్రంప్ చేతిలో మోడీ కీలు బొమ్మ గా మారారా అనే విమర్శలు మోడీ ఇమేజ్ కు సవాల్ గా మారాయి. రష్యా నుంచి ఇకపై భారత్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేయాలని, లేకుంటే భారత్ పై టారిఫ్ ల భారం మరింత పెరుగుతుందంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు కూడా మోడీ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది.

ఇలా ట్రంప్ విదేశీ విధానాలతో దేశంలో మోడీ ఇమేజ్ కొంచెం కొంచెంగా సన్నగిల్లుతోందా అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇవి క్షేత్ర స్థాయిలో ప్రజలలోకి వెళ్లగలుగుతాయా.? వారిని ప్రభావితం చెయ్యగలుగుతాయా.? బీజేపీ కి వ్యతిరేకంగా అడుగులు వేసేలా చేస్తాయా.? అన్నది ఒక ప్రశ్న అయితే

ఈ వివాదాలన్నిటిని తమకు అనుకూలంగా మలచుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఏకతాటి మీదకు తెచ్చే సత్తా కాంగ్రెస్ కు ఉంటుందా.? బీజేపీ నుండి అధికార పీఠాన్ని అందుకునేంత రాజకీయం రాహుల్ చేస్తారా.? చెయ్యగలరా .? అన్నది ఇక్కడ రెండవ ప్రశ్న.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అంతిమ లబ్దిదారు జగనే.. అయితే ఏంటి?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…

11 minutes ago

Jagan and YCP Missing Main Point On Laddu Problem?

The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…

12 minutes ago