Telugu

‘అర్జున్ చక్రవర్తి’ నుంచి వైరల్ మెలోడీ

స్పోర్ట్స్ డ్రామా సినిమాలు మోటివేషన్ తో పాటు ఓ ఇన్స్పిరేషనల్ జెర్నీని చూపిస్తాయి. అలాంటి కథలో ఓ హార్ట్‌ఫుల్ లవ్ స్టోరీ కూడా ముడిపడితే… అది ప్రేక్షకుడికి ఎమోషనల్‌గా మరింత దగ్గరగా అనిపిస్తుంది. ఈ భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాని విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా శ్రీని గుబ్బల నిర్మించారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శుభారంభం చేశారు. ‘మేఘం వర్షించదా’ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్ మదిని తాకుతూ వైరల్ అవుతోంది.

విఘ్నేష్ బాస్కరన్ అందించిన ఈ మెలోడీ, ప్రేమలోని తడిసిన భావోద్వేగాలను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. దర్శకుడు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ ప్రేమ అనుభూతిని అద్భుతంగా వివరించగా, కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ గళాలు ఈ పాటకు మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి.

ADVERTISEMENT

ఈ పాటలో విజయరామరాజు – సిజా రోజ్ జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. వారి మధ్య ఉన్న ఫీలింగ్స్ తెరపై హృదయాన్ని తాకేలా వచ్చాయి. ఈ పాటకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇటీవల కాలంలో రిలీజైన లవ్ సాంగ్స్‌ లో ‘మేఘం వర్షించదా’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. హార్ట్ టచ్చింగ్ ట్యూన్, ఎమోషనల్ లిరిక్స్, ఎస్తటిక్ విజువల్స్ అన్నీ కలిసి పాట సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పటికే 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్+ వ్యూస్, యూట్యూబ్‌లో 1.5 మిలియన్లు దాటిన టీజర్‌కు ఓ స్పోర్ట్స్ మ్యాన్ జీవితాన్ని ఆసక్తికరంగా చూపించారని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

కబడ్డీ ఆటగాడి జీవితాన్ని ఆధారంగా తీసుకున్న ఈ చిత్రంలో ప్రేమకథ కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతుందన్న సంకేతాలను ‘మేఘం వర్షించదా’ లవ్ సాంగ్ అందిస్తోంది.

త్వరలో విడుదలకానున్న ‘అర్జున్ చక్రవర్తి’ ఓ ఎమోషనల్ జర్నీగా ప్రేక్షకుల హృదయాల్లో నిలవబోతోందని ఈ పాట చూస్తే అర్ధమౌతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ghamasaan Review: Slow, Sincere Manhunt Drama

BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…

2 hours ago

Job Loss=Visa Loss? New H-1B Rule to be Published Friday

The Department of Homeland Security (DHS) has proposed a new rule. This rule is set…

3 hours ago