
అవును నిజమే… అంతలా సందడి చేయడానికి ఓ కారణం కూడా ఉంది. తెలుగు సినిమా అంటే కేవలం రెండున్నర్ర గంటలే అన్న నానుడి అటు టాలీవుడ్ వర్గాల్లోనూ, ఇటు సినీ ప్రేక్షకుల్లోనూ నాటుకుని పోయింది. ‘బాహుబలి 2’ సినిమా సైతం రెండు గంటల నలభై అయిదు నిముషాల వరకే పరిమితం అయ్యింది. అంతకన్నా ఎక్కువ నిడివి అయితే తెలుగు ప్రేక్షకులు ధియేటర్లలో కూర్చునే పరిస్థితి లేదన్నది తెలుగు సినీ దర్శకనిర్మాతల మరియు హీరోల అంచనా. అయితే ఈ స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేసాడు విజయ్. ఒక హీరోకు తన సినిమాపై నమ్మకం ఉంటే, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోరనడానికి విజయే నిదర్శనం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ… “మా సినిమా ట్రైలర్ ను మూడు నిముషాల పాటు చూపించాం… అయినా అప్పుడే అయిపోయిందా అనిపించింది… రేపు ధియేటర్లలో సినిమాను కూడా మూడు గంటలకు పైగా చూపిస్తున్నాం… అయినా అప్పుడే అయిపోయిందా…” అనే ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుందని విజయ్ చేసిన వ్యాఖ్యలు నిజం కావడం బహుశా అందరి విషయంలో జరుగుతుందో లేదో చెప్పలేం గానీ, రిలీజ్ కు ముందు మోత మోగిన విజయ్, ఘనవిజయం సాధించిన తర్వాత మాత్రం హుందాగా సైలెంట్ గా ప్రవర్తిస్తుండడం మెచ్చుకోదగ్గ విషయం.
నిజానికి మూడు గంటల నిడివితో సినిమాను విడుదల చేయాలంటే స్టార్ హీరోలు సైతం వణికిపోతుంటారు. గడిచిన రెండుమూడేళ్ళల్లో స్టార్ హీరోలు రెండు గంటల నలభై అయిదు నిముషాలతో విడుదలైన సినిమాలనే, ఆ తర్వాత ట్రిమ్మింగ్ లు చేసి ఓ పదిహేను, ఇరవై నిముషాల వరకు తగ్గించిన సందర్భాలున్నాయి. అంటే మూడు గంటల పాటు స్టార్ హీరోలనే చూడలేని పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో… ఓ సాధారణ హీరో ఏకంగా మూడు గంటల పాటు మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. సబ్జెక్ట్ లో ఎంత దమ్ము ఉన్నా, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయడంలో హీరోదే కీలకపాత్ర. దానిని వందకు వెయ్యి శాతం నిలబెట్టాడు హీరో విజయ్.
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…