
ఇదే సమయంలో బ్యాంకర్ల తీరు పట్ల జైట్లీతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నోట్లు రద్దై 20 రోజులు గడుస్తున్నా, పరిస్థితిని మెరుగు పరిచేందుకు బ్యాంకులు సరైన చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకర్లు చేస్తున్న తప్పిదాలకు తాము ఎలా బాధ్యత తీసుకోవాలని జైట్లీని చంద్రబాబు సూటిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద వందలాది మంది ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారని… దీంతో, ఎక్కువ క్యాష్ ను వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. ఏదేమైనప్పటికీ, నోట్ల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం పూర్థి స్థాయిలో దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. ఆ ఇబ్బందులను తొలగించేందుకు సబ్ కమిటీ వేసే దిశగా అడుగులు వేస్తోంది. మోడీ తీసుకున్న నిర్ణయానికి తొలి రోజు నుండి చంద్రబాబే మద్దతు పలుకుతుండడంతో, సదరు కమిటీకి నాయకత్వం వహించడానికి కేంద్రం వద్ద కూడా మరో ఆప్షన్ లేదని రాజకీయ వర్గాల టాక్.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…