
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేరు అనేది జగమెరిగిన సత్యమే. అయితే ఈ నేపథ్యంలో కొండా కుటుంబం వేసే తదుపరి అడుగు ఎటువైపు అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ని కాదని కొండా కుటుంబం బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంటుందా అంటే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అనే నానుడి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమంత టార్గెట్ గా నాడు చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
కొండా సురేఖ చేసిన ఈ విమర్శల పై అటు బిఆర్ఎస్ పార్టీ నుంచే కాదు ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. కేటీఆర్ సైతం మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేస్తానంటూ సురేఖ వ్యాఖ్యలను దిగజారుడు రాజకీయాలతో సరిపోల్చారు.
ఇటువంటి సందర్భంలో కొండా కుటుంబం కోసం గులాబీ కారు డోర్లు తెరుచుకుంటాయా.? అయితే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒకేఒక మినహాయింపు కొండా కుటుంబానికి వర్థిస్తుందేమో చూడాలి. అయితే తాజాగా కొండా సురేఖ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఉద్దేశించి కేసీఆర్ చాల మంచోడు అనే ఒక సరిఫికేట్ ఇచ్చిన నేపథ్యంలో కొండా సురేఖ ప్లాన్ – ఏ బిఆర్ఎస్ అనే వాదన వినిపిస్తుంది.
ఇక కొండా కుటుంబం రెండో ఆప్షన్ బీజేపీ, దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీ చెంతన చేరుతుందా.? టి. బీజేపీ లో కొండా కుటుంబానికి అంతటి ప్రాధాన్యం లభిస్తుందా.? బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల కూడా బీజేపీ జెండా కప్పుకున్నారు, అందుకు ఆయనకు జరిగిన రాజకీయ మేలు ఏమిటి అనేది అందరికి తెలిసిన విషయమే.
అందునా కొండా కుటుంబానికి పార్టీ పదవులలో కానీ, ప్రభుత్వ పదవులలో కానీ ఫ్యామిలీ ప్యాకేజీ ఉండాల్సిందే. బీజేపీ లో కొండా కుటుంబానికి ఆ అవకాశం దక్కుతుందా.? అంటే అందుకు జవాబు కూడా కొండా కుటుంబానికి తెలిసిన విషయమే.
ఇటువంటి పరిస్థితులలో కొండా అడుగులు ఎటువైపు అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రే తన లక్ష్యం అంటూ టిఆర్ఎస్ తో తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం తానే అంటూ రాజకీయ యుద్ధం మొదలుపెట్టిన కవిత చెంతకు కొండా కుటుంబం చేరుతుందా అనేది మరో ఆప్షన్.
అసలు తెలంగాణ లో అధికారంలో ఉన్న పార్టీలో వచ్చిన అవకాశాన్ని చేచేతుల కాలతన్నుకున్న కొండా కుటుంబం మరోపార్టీలో చేరి, అక్కడ నాయకులతో కలిసి పని చేసి, ఆ పార్టీ అధిష్టానాన్ని మెప్పించి తమ రాజకీయ అవసరాలను సంతృప్తి పరుచుకోగలరా.?
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…