
సరే ఏదో ఒకటి అని ప్రజలు కూడా సరిపెట్టుకున్నారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల మాదిరే విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణంలో 90% కేంద్రమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 2015-20 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు ఈ వెసులుబాటు వర్తింపజేస్తామని ప్రకటించారు.
ఐతే ఇవన్ని నీటి మీద రాతలే అని తేలిపోయాయి. ఏడాది గడిచినా ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం, దానిపై కేంద్రం వివరణలు కోరడంతోనే పుణ్యకాలం గడిచిపోతోంది. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి నిరాశే ఎదురయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 19,161 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రం వద్దకు పంపింది. ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు చెబుతూనే కేంద్రం రకరకాల షరతులు విధించించడం వల్ల రుణ వ్యవహారం ముందుకుసాగడం లేదు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన వాటా కింద 30% నిధులు ఖర్చు చేస్తేనే మిగతా రుణం గురించి ఆలోచిస్తామని చెబుతోంది. ఐతే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురుకుంటున్న రాష్ట్రానికి ఇది చాలా కష్టం. దానితో బాజపా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ని కూడా అటుక ఎక్కించే ప్రయత్నం చేస్తుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…