ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ముందుండి బన్నీకి సన్మానం చేస్తారా?

69 ఏళ్ళ నేషనల్ అవార్డ్స్ లో చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఇప్పటివరకూ ఏ తెలుగు నటుడు సంపాదించ లేని ఘనత – ఉత్తమ నటుడి అవార్డు బన్నీ రాబట్టాడు. దీనితో అల్లు కాంపౌండ్ లో సంబరాలు మిన్నంటాయి.

ఇకపోతే అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడం మెగా అభిమానుల్లోనే ఒక సెక్షన్ కి పెద్ద షాక్. వీరు చాలా వరకూ అల్లు అర్జున్ ను తమ వాడిగా చూడరు. సోషల్ మీడియా లో అయితే ఓపెన్ గానే బన్నీ ని తిడుతూ ఉంటారు.

ADVERTISEMENT

పైగా ఈ సారి ఈ అవార్డు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను రాంచరణ్ కు వస్తుందని గట్టిగా నమ్మారు. రామ్ చరణ్ కు రాకపోగా అల్లు అర్జున్ కు రావడం పెద్ద షాక్.

ఫ్యాన్స్ గురించి అటు ఉంచితే చిరంజీవి – అల్లు ఫ్యామిలీ కి కూడా కొంత గ్యాప్ ఉందని పుకారు. రామ్ చరణ్ కు రాకుండా అల్లు అర్జున్ కి రావడం ఒక తండ్రిగా చిరంజీవి కి నిరాశే. కాకపోతే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి కి ఇంకో బాధ్యత ఉంది – అది ఇండస్ట్రీ తరపున బన్నీ ని సన్మానించాలి.

కాకపోతే మెగా ఫ్యాన్స్ లాగా చిరంజీవి బయటపడరు. అల్లు ఫ్యామిలీ తో గ్యాప్ ఉన్నట్టుగా కనిపించినా ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడూ చిరంజీవి బయటపడరు. లౌక్యం తో మేనేజ్ చేస్తారు.

అందుకే అవార్డు రాగానే ఒక ట్వీట్ వేసేశారు.

కాకపోతే ఈ సన్మాన కార్యక్రమాన్ని ముందుండి సన్మనించేంత ఉంటుందా అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Known Telugu OTT Platform Resorts to Paid Fake Tweets

The latest trend in Tollywood is hard to miss. For the past year, whenever a…

13 minutes ago

Kakinada CII Summit: ₹4,256 Crore Investment Proposals

Andhra Pradesh IT and Industries Minister Nara Lokesh has highlighted investment proposals worth ₹4,256 crore…

33 minutes ago