
ఇటీవలే ముగిసిన ఆసియా కప్పు లో భారత్ – పాక్ ల మధ్య జరిగిన మూడు మ్యాచ్లు మూడు సంచనాలనే చెప్పాలి. మొదటి రెండు సార్లు హ్యాండ్-షేక్, ఆటగాళ్ల చేష్టల వల్ల వివాదానికి కారణమవగా, హోరా-హోరి గా సాగిన ఫైనల్ లో ఏకంగా ఈ వివాదం ఏ.సి.సి చైర్మన్ వల్ల జరిగింది.
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ ను నెగ్గిన భారత్, కప్పును మాత్రం ఇంటికి తీసుకురాకుండానే వచ్చింది. ప్రస్తుత ఏ.సి.సి చైర్మన్ గా ఉన్న పాక్ దేశ మంత్రి మొహసిన్ నక్వీ చేతుల మీదగా తాము ట్రోఫీ ను తీసుకోము అని భారత ఆటగాళ్లు ఒక నిర్ధారణకు రాగా, నక్వీ కూడా తన చేతుల మీదనే భారత్ కు కప్పు ఇస్తాను అంటూ పట్టుబట్టారు.
దీనితో ఇరు వర్గాలు తమ పట్టు విడవగకపోవడంతో నక్వీ తనతో పాటు ఆసియా కప్పును పట్టుకెళిపోయాడు. దీని పైన స్పందిండిన టీం ఇండియా టి – 20 కెప్టెన్ సూర్య ‘ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు, ఒక టోర్నీ లో పాలుపంచుకుని, నెగ్గిన తరువాత కూడా ట్రోఫీ లేకపోవటం చాల విడ్డురం’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
పైగా, బీసీసీఐ అఫీషియల్ రాజీవ్ శుక్ల సైతం ‘ఆ ట్రోఫీ ఏ.సి.సి ఆధీనం లో ఉంటుంది, నక్వీ ఆధీనంలో కాదు’ ఆసియా కప్పు నక్వీ సొంత ఆస్తి కాదు తనతో పాటు పట్టుకెళ్ళడానికి అంటూ ఫైర్ అయ్యారు.
అయితే, మొదట తన చర్యలను సమర్ధించుకున్న నక్వీ ఇప్పుడు వెనక్కి తగ్గి బీసీసీఐ కు క్షమాపను చెప్తూనే, మరోవైపు కప్పును మాత్రం సూర్య కుమార్ యాదవ్ ఏ.సి.సి ఆఫీస్ కు వచ్చే పట్టుకెళ్ళాలి అని బెట్టు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక పక్క క్షమాపను అడుగుతూనే, మరో పక్క తన దగ్గరికి వచ్చి కప్పును పట్టుకెళ్లాలనే బెట్టును సైతం చూపిస్తున్నారు నక్వీ. ప్రస్తుతం దీని పైనే సోషల్ మీడియా లో భారత అభిమానులంతా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి, దీనికి బీసీసీఐ లేదా సూర్య ఏమని బదులిస్తారో అని..?
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…