
ఈ విషయమై సంబంధిత పీఆర్ఓను సంప్రదించిన క్రమంలో ప్రస్తుతానికి అయితే “రాధే శ్యామ్” జనవరి 14వ తేదీన విడుదల కానుందని, ఇందులో ఎలాంటి మార్పులు లేవని, ఊహాగానాలను నమ్మవద్దని తెలిపారు. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా పది రోజుల సమయం ఉంది గనుక ఇందులో కొన్ని ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ కూడా ఉన్నట్లే అనుకోవాలి.
ఈ రోజుకున్న సమాచారం ప్రకారం సినిమా వాయిదా వేసుకునే ప్రకటన లేదు గానీ, దేశంలో నానాటికి పెరుగుతోన్న కరోనా కేసులు, అలాగే ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తోన్న కరోనా ఆంక్షలతో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్న టాక్ బలంగా వినపడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ‘రాధే శ్యామ్’ విడుదల అవుతుందని నమ్మే వారి కంటే, వాయిదా పడుతుందన్న విశ్వాసమే బలంగా ఉంది.
ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా ప్రకటన కూడా విడుదలకు అయిదు రోజుల ముందు వెలువడిన విషయం తెలిసిందే. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే పరిస్థితులు రోజురోజుకి సన్నిగిల్లుతుండడంతో “రాధే శ్యామ్”పై వాయిదా ఊహాగానాలు నెలకొన్నాయి. బహుశా చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఏదైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…