
ఈ సినిమా కోసం జరిపిన పరిశోధనలో భాగంగా నాలుగేళ్ల క్రితం ఓ జ్యోతిష్కుడిని కలిశామని, ఆ సందర్భంలో ఆయన 2022 మొదటి భాగంలో ఈ సినిమా విడుదల అవుతుందని చెప్పారంటూ మీడియా మిత్రులతో పంచుకున్నారు. అయితే ఆ సమయంలో దానిని నేను నమ్మలేదని, ఇపుడు అదే నిజం అవుతుండడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.
“రాధే శ్యామ్”లో హీరో క్యారెక్టర్ అదే అవ్వడంతో ఈ అంశం మరింత ఇంటరెస్టింగ్ గా మారింది. అయితే దీనికి మన నెటిజన్లు అడుగుతోన్న ప్రశ్నలు మరింత హిలేరియస్ గా ఉన్నాయి. మరి సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అడగలేదా? అలాగే టికెట్ ధరల ఇబ్బందులు వస్తాయని చెప్పలేదా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అడుగుతూ ఆడుకుంటున్నారు.
అయితే ఇది ప్రెస్ మీట్ లో చెప్పాల్సిన విషయం కాదు, నాడు ట్రైలర్ రిలీజ్ రోజున చెప్పి ఉంటే మరింత హైలైట్ అయ్యేది, “రాధే శ్యామ్” యూనిట్ కు పబ్లిసిటీ చేసుకోవడం కూడా రావట్లేదు, ఇంత మంచి పాయింట్ ను అంత పెద్ద వేడుక మీద ఎలా మరిచిపోతారు? అంటూ యంగ్ రెబల్ స్టార్ అభిమానులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.
యూట్యూబ్ లో ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ క్లిక్స్ అందుకోవడంతో హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లాంటి ఓ భారీ మాస్ ఇమేజ్ నటించిన ఈ
“రాధే శ్యామ్”లో ఒక్క ఫైట్ గానీ, కనీసం ఛేజింగ్ సీన్ గానీ ఉండదని ముందే చెప్పి అభిమానులను మానసికంగా సిద్ధం చేసారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…