Telugu

త్రివిక్రమ్ విడుదల చేసిన ట్రైలర్ భలే ఉందిగా!

చిన్న చిన్న సినిమాలే కొత్త కొత్త కాన్సెప్ట్ లను ఇండస్ట్రీలోకి తీసుకువస్తాయని తాజాగా విడుదలైన “అవసరానికో అబద్ధం” ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. త్రివిక్రమ్ విడుదల చేయడంతో ఈ సినిమాకు ప్రచారం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే జరుగుతోంది.

కొత్త నటులతో చిత్రీకరించిన ఈ సినిమా కధ హార్రర్ నేపధ్యంలో తెరకెక్కింది. సాధారణంగా ఇలాంటి హార్రర్ సినిమాలకు నేపధ్య సంగీతమే ఆయువుపట్టు. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేసాడు సాయి కార్తీక్. ఇటీవల కాలంలో చిన్న చిత్రాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్న సాయి కార్తీక్ ఇచ్చిన సంగీతం ఈ ట్రైలర్ కు ప్రాణం పోసింది.

ADVERTISEMENT

అయితే సురేశ్ దర్శకత్వం ఈ సినిమా ట్రైలర్ కు, టైటిల్ కు ఎక్కడా సంబంధం లేనట్లుగా కనపడుతోంది. బహుశా పూర్తి సినిమా వస్తే దీనిపై ఓ స్పష్టత వస్తుందేమో చూడాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వీక్షిస్తున్న ట్రైలర్ కావడంతో… చూసిన వెంటనే ‘భలే ఉందిగా’ అన్న అనుభూతి ప్రేక్షకులకు కలగడం సహజమే.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

PK’s Honest And Hitting Talk On Alliance!

The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…

25 minutes ago

వేలకోట్లు ఆవిరవడానికి రెండు చుక్కలు చాలు!

వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…

41 minutes ago