Telugu

ఇలాంటి ఫోటోలు మేము జీర్ణించుకోలేము బ్రో!

ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, ఆంధ్రాలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆప్యాయత మాటల్లో, చేతల్లో కనబరుస్తారే తప్ప బహిరంగంగా ఒకరినొకరు కౌగలించుకునే అలవాటు లేదు.

కానీ ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులలో ఈ అలవాటు బాగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఎప్పుడు ఎదురుపడినా ఆప్యాయంగా కౌగలించుకుంటారు.

ADVERTISEMENT

నేటి నుంచి విశాఖ నగరంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కూడా వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఈ ఫోటోలు మీడియాలోకి వచ్చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాడు టీడీపీ నుంచి బీజేపీని విడగొట్టేందుకు నేను చాలా కుట్రలు చేశానని పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత టీడీపీ, జనసేనలను విడగొట్టేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. కానీ ఫలించడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లలో ఏర్పడిన విభేదాలతో కూటమి ముక్కలవుతుందని ఆశ పడితే, కూటమి ఘన విజయం సాధించింది. దాంతో వాటి మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు మెల్లగా సమసి పోతున్నాయి.

ఈ ఓటమిని జీర్ణించుకోవడమే వైసీపీ వల్ల కావడం లేదు. అలాంటిది తాము విడిపోవాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఇద్దరూ ఇలా ఆప్యాయంగా కౌగలించుకొని మాట్లాడుకోవడం చూసి తట్టుకోవడం చాలా కష్టమే. కానీ రాజకీయాలలో హుందాతనం పాటించాలని చెప్పి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు కనుక మౌనంగా భరించక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sekhar Master Escapes Major Accident After Kaaka Shoot

Choreographer Sekhar Master met with a road accident near Shamshabad while returning from a song…

17 minutes ago

రాజకీయాలలో హుందాతనం కూడా వైసీపీ సొంతం?

‘మాట తప్పను... మడమ తిప్పను,’ పేటెంట్ హక్కులు వైసీపీ సొంతం. ఇప్పుడు ‘రాజకీయాలలో హుందాతనం పాటించడంపై కూడా పేటెంట్ హక్కులు…

42 minutes ago