
కాసేపటి క్రితం ఆ సినిమా టీజర్ విడుదల అయ్యింది. దెయ్యం కనపడకుండా కొన్ని కొన్ని పనులు చేస్తూ భయపెట్టింది. రిటీన్ గా దెయ్యం సినిమాల్లో ఇది జరిగేదే కొత్తగా ఏమి లేదు. దానితో సినిమా టీజర్ కు రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ నిర్మాత దిల్ రాజు సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో రవిబాబు ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు కథ రాసింది కూడా రవిబాబే. ఆయన ఇతరుల చేత కథలే రాయించుకోవడం కంటే తన సొంత క్రియేటివిటీతో మంచి కథలు రాసుకుని వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు.
ఈ మధ్య రవిబాబు సినిమాలను సురేష్ బాబు విడుదల చేశారు. ఇప్పుడు దిల్ రాజు కు మారారు. దిల్ రాజు లక్ ఏమైనా రవిబాబుకి కూడా అంటిస్తారేమో చూడాలి. ఇప్పటివరకూ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. సోలో రేలీజ్ డేట్ కోసం చేస్తున్నారట. దిల్ రాజు కాబట్టి మంచి రిలీజ్ ఉంటుంది. పబ్లిసిటీ కి అయితే ఎటు వంటి ఢోకా ఉండదు.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…