
2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. ఈ పాటలో మాధురి దీక్షిత్ స్థానంలో మోహినీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించింది. అలాగే అప్పట్లో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ ఆలపించగా, ప్రస్తుత రీమిక్స్ పాటను టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడింది.
స్వతహాగా కొరియోగ్రాఫరైన అహ్మద్ ఖాన్ పాత పాటతో ఈ పాటను పోల్చకుండా వుండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకే ఒక్క స్టెప్పు మినహా మిగిలినవన్నీ కొత్త స్టెప్పులను కంపోజ్ చేసాడు. అయితే మాధురి సాంగ్ తో పోలిస్తే… అంత ఊపు లేదన్నది వాస్తవం. ఏది ఏమైనా ఈ పాటకున్న క్రేజ్ రీత్యా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…