
మరి 2017, ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోయే సంచలన చిత్రం గురించి ఇప్పటికే సోషల్ మరియు వెబ్ మీడియాలలో సమాచారం హల్చల్ చేస్తున్న సంగతి నెటిజన్లకు తెలిసిందే. అవును… తొలి పార్ట్ తో 600 కోట్లను తన ఖాతాలో వేసుకుని, రెండవ పార్ట్ తో 1000 కోట్లు లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమా గురించే ఇదంతా. ఇప్పటికే ఆకాశాన్ని తాకిన అంచనాలకు, ఈ ఏప్రిల్ 28వ తేదీ సెంటిమెంట్ కూడా తోడయితే… ఇక చిత్ర యూనిట్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదేమో!
రాజమౌళి పాటిస్తున్న మరో సెంటిమెంట్ ఏమిటంటే… “బాహుబలి – ది బిగినింగ్” సినిమా రిలీజ్ డేట్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా “బాహుబలి – ది కన్ క్లూజన్” విడుదల తేదీని కూడా కరణ్ జోహార్ చేతనే ప్రకటింపచేయడం… ఆల్ టైం రికార్డులకు మరింత బలాన్నిస్తోంది. ప్రస్తుతం వ్యక్తమవుతున్న సెంటిమెంట్లన్నీ వర్కౌట్ అయితే… తెలుగు సినిమాలకు ప్రతి ఏడాది ఏప్రిల్ 28వ తేదీ ఒక హాట్ హాట్ డేట్ గా మారిపోవడం ఖాయం. ఇదే రోజు శబరిమలైలో కొలువుతీరిన మణికంఠ ‘అయ్యప్పస్వామి’ జన్మదినం అన్న విషయం దైవభక్తులకు తెలిసిన సంగతే.
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…