
ఎవరి లెక్కలు వారికున్నాయి. అయితే వాటన్నింటిని మించిపోయే రీతిలో ‘బాహుబలి 2’ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఉంటుందన్న వాదన కూడా వినపడుతోంది. ముఖ్యంగా ఫస్ట్ డే నాడు ‘బాహుబలి 2’ రేంజ్ ఎంత? కొందరు 200 కోట్లు అంటుంటే… మరికొందరు అంతకుమించి అంటున్నారు. అయితే ఈ ఉధృతి ఎంతవరకు అన్నది నిజంగా ట్రేడ్ పండితులకు కూడా అంతుపట్టడం లేదు. దీనికి ప్రధాన కారణాలు… పెరిగిన టికెట్ల ధరలతో పాటు, ‘బాహుబలి 1’తో పోలిస్తే, ఈ పార్ట్ కు మరిన్ని ఎక్కువ ధియేటర్లు కేటాయించారు. దాంతో పాటు రోజుకు ప్రదర్శితమయ్యే షోల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
దీంతో ‘బాహుబలి 2’ ఫస్ట్ డే రేంజ్ ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. లోకల్ పరిస్థితి ఇలా ఉంటే, యుఎస్ మార్కెట్ లోనూ ‘బాహుబలి 2’ మేనియా కనపడుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి ప్రీమియర్ మరియు ఫస్ట్ డే నాడు ఏకంగా 1000 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతున్న నేపధ్యంలో… ఎన్ని మిలియన్లను తాకుతుంది అన్న ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి 2’ ఒక్క తెలుగులోనే 2 మిలియన్ సంఖ్యను చేరుకోగా, ప్రస్తుతం అది డబుల్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి కూడా ఎవరూ అంచనాలు వేయలేకపోతున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి మ్యాచ్ కు బెట్టింగ్ లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో… ‘బాహుబలి 2’ పైన కూడా అదే స్థాయిలో సరదాకైనా పందాలు కాసుకుంటున్నారని చెప్పవచ్చు. ఫస్ట్ డే నాడు ఎంత కొట్టినా గానీ, “ఇండియాస్ ఫస్ట్ 1000 కోట్ల సినిమా మాత్రం బాహుబలి 2” అని అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇందులో మాత్రం ఎలాంటి ట్విస్ట్ ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గీయులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాగే మొదటి మూడు రోజుల్లోనే ‘బాహుబలి’ స్థాపించిన గత రికార్డులను కనుమరుగు చేస్తుందన్న టాక్ కూడా ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరి మీరేమంటారు..?!
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…