Telugu

బాహుబలి 2… కల చెదిరినట్లేనా..!

ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ తో అనేక ‘ల్యాండ్ మార్క్స్’ను అందుకున్న సినిమాగా “బాహుబలి 2” సరికొత్త రికార్డులను సృష్టించిందన్న విషయం పాతదే. ట్రేడ్ వర్గాల ఊహలకందని రీతిలో సాగిన ఈ సినిమా కలెక్షన్ల ప్రస్థానం, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లు అధిగమించి 1600 వైపుకు పరుగులు పెడుతోంది.

ADVERTISEMENT

ఇక ఏరియాల వారీగా చూసుకుంటే… అమెరికా మార్కెట్ లో 20 మిలియన్స్ జెండాను విజయవంతంగా ఎగురవేసింది. ఇక యుఎస్ మార్కెట్ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. దాదాపుగా యుఎస్ మార్కెట్ క్లోజ్ అయినట్లే భావించవచ్చు. మహా వచ్చినా ఇంకో లక్ష డాలర్లకు మించి వచ్చే అవకాశం లేదు. అమెరికా నుండి ఇండియాకు వస్తే… మలయాళంలో 100 కోట్లు సాధించి, మోహన్ లాల్ రికార్డులను కూడా తిరగరాస్తోంది.

తమిళంలో కూడా ‘ఎందిరన్’ రికార్డులకు ‘బాహుబలి 2’ ఎర్త్ పెట్టినట్లే. బాలీవుడ్ విషయానికి వస్తే… ఇప్పటికే నెంబర్ 1 స్పాట్ లో ఉండగా, 500 కోట్ల మార్క్ ను చేరుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటివరకు 183.22 కోట్లు షేర్ సాధించిందని స్పష్టమైన సమాచారం లభించింది. అయితే తొలి రెండు వారాల్లో ఉధృతిని చూసి 200 కోట్ల షేర్ అందుకుంటుందని భావించారు.

కానీ, ఇది కలగానే చెప్పవచ్చు. 200 కోట్ల షేర్ ను అందుకోవాలంటే ఇంకా 17 కోట్లు అందుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత మొత్తం కష్టమేనని చెప్పవచ్చు. మహా అయితే 190 కోట్ల మార్క్ ని ‘బాహుబలి 2’ అందుకుంటుందేమోనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికీ గౌరవప్రదమైన కలెక్షన్లు సాధిస్తున్నప్పటికీ, తగ్గిన స్క్రీన్స్ రీత్యా 200 కోట్ల షేర్ కలేనని చెప్పవచ్చు.

మరి ‘బాహుబలి 2’నే అందుకోలేకపోతే, ఇంకే సినిమా అందుకుంటుంది? అంటే రాజమౌళి ‘మహాభారతం’ వచ్చేవరకు అలాంటి ఆలోచనలకు ఆస్కారం లేదన్న టాక్ వినపడుతోంది. అంతేనంటారా..? లేక మెగాస్టార్ “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” ద్వారా ప్రభంజనం సృష్టిస్తారా? ఏమో..?! సాధారణ కమర్షియల్ సినిమాలకైతే అంత సీన్ లేదు గానీ, ఏదైనా చారిత్రాత్మక సినిమాలకైతే ఎంతో కొంత అవకాశం ఉందని చెప్పవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

3 hours ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

7 hours ago