
ఇప్పటివరకు ఏవో ఒకటి, రెండు షూటింగ్ పిక్స్ లీక్ కావడం తప్ప, పెద్దగా ‘బాహుబలి 2’కు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేయలేదు. తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఓ ఫోటో మాత్రం ‘బాహుబలి’పై పెట్టుకున్న అంచనాలను అందుకునే విధంగా ఉంది. ఎలా లీక్ అయ్యిందో తెలియదు గానీ, చుట్టూ ఎత్తైన కొండల సెట్ లో జరుగుతున్న షూటింగ్ పిక్ అద్భుతంగా ఉంది.
లీక్ అయిన ఫోటోలలోనే సెట్స్ ఈ రేంజ్ లో దర్శనమిస్తుంటే, 2017 ఏప్రిల్ 28వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై తారసపడనున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఉత్సుకత కలగడం సహజమే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’ సెంటిమెంట్స్ నే ఈ సినిమాకు కూడా జక్కన్న వర్తింపచేస్తున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…