
అయితే ఉదయం 9 గంటలకే ధియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ కోసం, సాయంత్రం 5 గంటల వరకు వేచిచూడాలంటే కష్టమైన పనే. దీంతో ధియేటర్లలో ప్రదర్శించే ఈ ట్రైలర్ పైరసీకి గురికావడం తధ్యమనే చెప్పవచ్చు. ఫోన్ కెమెరాలలో బంధించి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకోవడం ఇటీవల కాలంలో అతి సహజంగా జరిగే ప్రక్రియ. సహజంగా ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పరచుకున్న సినిమాల యొక్క స్నాప్ షాట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే.
మరి అలాంటిది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ‘బాహుబలి 2’ వంటి క్రేజీ సినిమా ట్రైలర్ ను తమ కెమెరాలలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండగలరా? అంటే నిస్సందేహంగా కాదనే చెప్పవచ్చు. దీంతో హెచ్.డి ట్రైలర్ వీక్షించాలంటే, మార్చి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వేచిచూడాలి గానీ, అసలు ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం అంత సమయం నిరీక్షించాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినీ వర్గాల టాక్ ప్రకారం అయితే ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు పదింతలు అవుతాయని తెలుస్తోంది.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…