
ఇక ప్రస్తుత పరిస్థితి వస్తే… భారీ అంచనాలు నెలకొన్న ‘బాహుబలి 2’ ధియేటర్లలో ప్రత్యక్షం కావడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ లోపున ‘బాహుబలి 2’ యొక్క తమిళ వర్షన్ కు చెందిన కొన్ని సీన్లు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం కలవర పెడుతోంది. అయితే ఇవి ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చాయా? లేక పైరసీ వ్యవహారాలలో భాగంగా వచ్చాయా? అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ, సినిమా విడుదల కాకముందే పైరసీ సాధ్యం కాదు గనుక, లీకేజ్ లో భాగంగానే వీటిని సోషల్ మీడియాలోకి వదిలినట్లుగా భావించాల్సి ఉంటుంది.
అయితే లీక్ అయిన ఈ కొన్ని సన్నివేశాల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు గానీ, సినిమా విడుదలయ్యే సమయానికి మొత్తం ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయితే గనుక డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. విజువల్ వండర్ గా నిలిచే ఇలాంటి సినిమాలను పైరసీలో చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంటుందని భావించినప్పటికీ, ఇలా పైరసీ వస్తే గనుక సినిమాపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీంతో ఈ లీకేజ్ మరియు పైరసీపై ‘బాహుబలి 2’ ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే అప్పుడు ట్రైలర్, ఇప్పుడు సినిమా సీన్లు… రెండూ తమిళ వర్షన్ వే ఎలా లీక్ అయ్యాయి?
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…