
తాజా సినీ వర్గాల సమాచారం మేరకు ఈ ట్రైలర్ దాదాపుగా రెండున్నర్ర నిముషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ‘విజువల్ ట్రీట్’గా ఉండనున్న ఈ రెండున్నర్ర నిముషాల ట్రైలర్ ను సినిమా విడుదలయ్యే అన్ని భాషలలోనూ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఏప్రిల్ 28వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ట్రైలర్ ను కూడా ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేసి, అన్ని భాషల వారికి చేరువ చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా డిక్లేర్ చేయాల్సి ఉంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే తొలిసారిగా 1000 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనాలు ఉన్న ఈ సినిమా, ఆ ఫీట్ ను అందుకోగలిగితే తెలుగు సినిమా స్థాయి మరింతగా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కూడా… ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1000 మార్క్ ను అవలీలగా అందుకుంటుందని చెప్తున్నారు. దానికి అంకురార్పణ ఏప్రిల్ 28వ తేదీ కానుంది.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర…
Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…