
ఒక్క వ్యూస్ విషయంలోనే కాదు, ఇండియాస్ మోస్ట్ లైక్డ్ వీడియోగా కూడా ఈ ట్రైలర్ నిలిచింది. తొలి 100 మిలియన్ వ్యూస్ లో స్థానం సంపాదించి, సరికొత్త బెంచ్ మార్క్ ను సృష్టించిన ఈ “బాహుబలి 2” ట్రైలర్ ను అందుకునే సత్తా ఎవరికుంది? అసలు మరో ట్రైలర్ అందుకుంటుందంటారా? అలా జరగాలంటే మళ్ళీ రాజమౌళినే ఏదొక అద్భుతాన్ని తీయాలి అనే భావన కలగడం సహజమే.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నాడు సాయంత్రం జరగబోయే వేడుకలో కీరవాణి అందించిన పాటలను కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే తమిళంలో ఏప్రిల్ 9వ తేదీన సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిధిగా ఆడియోను ఆవిష్కరించబోతున్నారు. ఇలా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 28వ తేదీన సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి 7500 స్క్రీన్లపై దండయాత్ర చేయబోతున్నారు.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…