
‘బాహుబలి’ విడుదలైన తొలి పార్ట్ లో అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తిగా నాజర్ కనిపించాడు. నాజర్ కుడిచేయి సరిగా ఉండదంటూ రాజమౌళి చూపించారు. అయితే రెండవ పార్ట్ విషయానికి వస్తే నాజర్ ఎడమ చేయి సరిగా ఉండదన్నట్లుగా చూపించడం విశేషం. ట్రైలర్ లో ఓ షాట్ లో నాజర్ తన కుడి చేతితో గోడను బలంగా గుద్దగా, అది విరిగిపోతుంది. ఈ షాట్ నాజర్ కుడిచేయి సరిగానే ఉంటుంది గానీ, ఎడమచేయి మాత్రం అవిటిగా ఉంటుంది. దీంతో కుడి, ఎడమైతే పొరపాటు కాదా… అంటూ జక్కన్నను ప్రశ్నిస్తూ నెటిజన్లు సందడి చేస్తున్నారు.
అయితే ఇదేమీ చిన్న తప్పు కాదు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే దర్శకధీరుడు రాజమౌళి, చేయి మార్పుల విషయాన్ని గమనించకుండానే పెట్టేసారా? లేక దీని వెనుక కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారా? ఏమో ఇదంతా తెలియాలంటే 28వ తేదీ వరకు వేచిచూడాల్సిందే గానీ, ‘బాహుబలి’ని సిల్వర్ స్క్రీన్ పై చూసే ఏమోషన్ లో నాజర్ చేయి మార్పుకు ప్రాధాన్యత దక్కుతుందంటారా? డౌటే..! అయితే మరీ ఇంత బ్లండర్ గా రాజమౌళి కూడా పెట్టేసుంటారంటారా..?
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Yash’s Toxic is getting another version in theatres, and this one comes with a noticeably…