
[m9ad]
అయితే గత ఏడాది 2017లో జపాన్ బాషలో విడుదల అయిన బాహుబలి సినిమా మంచి హిట్ అందుకోవడమే కాకుండా, అక్కడ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ కి వెళ్లారు కూడా. ఇక ఇప్పుడు మరో మారు బాహుబలి టీమ్ కి జపాన్ నుంచి ఆహ్వానం అందిందట…దానికి గల కారణం ఏంటి అంటే అక్కడ, ఆ దేశంలో జరుగుతున్న “కామిక్ కాన్” ఉత్సవాల్లో బాహుబలి టీమ్ పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందించారు జపాన్ దేశం వారు. ఇక ఇప్పటికే రాణా..శోభు ఇద్దరూ జపాన్ వెళ్ళడానికి సిద్దం కాగా, వారితో పాటు ప్రభాస్ కూడా అక్కడకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరో పక్క జపాన్ దేశంలో అసలు బాహుబలి అంత భారీ హిట్ కావడానికి అసలు కారణం ఏంటి అంటే లోకల్ పత్రికల కధనాల ప్రకారం మన బాహుబలి జపనీస్ పురాణ కధలను పోలి ఉందట. ఇదే విషయాన్ని అక్కడి పత్రికలు, మ్యాగజీన్స్ అన్నీ కార్టూన్స్ రూపంలో వేసి భారీగానే పొగిడేసారట. మొత్తంగా చూసుకుంటే అక్కడ బాహుబలి టీమ్ అంటే మంచి గౌరవం ఉంది అని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక అక్కడ మ్యాగజీన్స్ లో వచ్చిన కార్టూన్స్ ని మన రాణా దగ్గుపాటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీలుంటే మీరు వెళ్ళి ఒక లుక్ వెయ్యండి..!
The Supreme Court’s hearing on the Andhra Pradesh municipal elections could change the fate of…
Chiranjeevi is reportedly preparing to enter a new space with his talk show MEGAVerse for…