Telugu

‘2’ రికార్డుల ఖాతా ఓపెన్!

భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన తెలుగు సినిమా ‘బాహుబలి-2’పై కూడా విడుదలకు ముందే కాసుల వర్షం కురుస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రానికి సంబంధించిన తమిళ అనువాద హక్కులు 45 కోట్లకు అమ్ముడైపోయాయి. ఈ మేరకు ఈ చిత్ర యూనిట్ కు చెందిన ఓ కీలక వ్యక్తి దేశీయ న్యూస్ ఏజెన్సీ ‘ఐఏఎన్ఎస్’కు చెప్పారు. అయితే సదరు హక్కులు కొనుగోలు చేసిన వ్యక్తి పేరును మాత్రం బయటపెట్టలేదు.

తమిళ హక్కులు 45 కోట్లకు అమ్ముడుబోయిన మాట వాస్తవమేనని చెప్పిన సదరు వ్యక్తి, ఆ హక్కులను దక్కించుకున్న వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క తదితర భారీ తారాగణం నటిస్తున్నారు.

ADVERTISEMENT

టాలీవుడ్ సూపర్ హిట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టనుందని ఇప్పటినుండే జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అయితే అన్నింటా విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమా, ఇటీవల చైనాతో పలు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం ఏమీ ‘బాహుబలి 2’పై కనపడకపోవడాన్ని, ప్రస్తుత తమిళ మార్కెట్ హక్కులే చాటిచెప్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

షర్మిల రీ ఎంట్రీ కోసం జగన్ ఎదురుచూస్తున్నారా.?

వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…

31 minutes ago

FaFa’s DTTT Trailer Mixes Fantasy, Mystery And Comedy

The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…

53 minutes ago