Telugu

‘బిగ్ బాస్ 2’పై బిగ్ న్యూస్!

నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేయబోతున్న “బిగ్ బాస్ 2″లో పాల్గొనబోయే 16 మంది సెలబ్రిటీలు ఎవరు? అందరూ సెలబ్రిటీలేనా? లేదా సాధారణ ప్రజలకు కూడా అవకాశం ఇస్తామంటూ చేసిన పబ్లిసిటీ వలన ప్రయోజనం ఉందా? ఎవరికైనా సామాన్యులకు అవకాశం కల్పించారా? అంటే అవును అన్న సమాధానమే లభిస్తుంది. ‘బిగ్ బాస్ 2’ సీజన్ లో పాల్గొనబోయే 16 మందిలో 13 మంది సెలబ్రిటీలు కాగా, 3 సామాన్యులు కూడా ఉన్నారు.

ముందుగా సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే… దీప్తి సునయన, తేజస్వి మదివాడ, కుషాల్, గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, భాను, రోల్ రిదా, శ్యామల, కిరీటి దామరాజు, సామ్రాట్ లతో పాటు బాబు గోగినేని కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. సైన్సు తప్ప ఈ ప్రపంచంలో మరే శక్తి లేదు, దేవుడు లేడు, మూడనమ్మకాలతో ప్రజలు జీవిస్తున్నారు అంటూ చెప్పే బాబు గోగినేని ఈ సీజన్ లో నిలవడం ‘బిగ్ బాస్ 2’కు చాలా బిగ్ న్యూస్ గా పరిగణించవచ్చు.

ADVERTISEMENT

దీంతో ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కు లోటు లేదన్న విషయం బహు స్పష్టం సుమీ! అలాగే సామాన్యులలో గణేష్, సంజన, నూతన్ నాయుడులు అనే ముగ్గురు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. దీంతో ఇంతకుముందు హల్చల్ చేసిన రాశి, గజాలా వంటి హీరోయిన్ల పేర్లు కేవలం పుకార్లకే పరిమితం అని స్పష్టమయ్యింది. చివరి నిముషం ట్విస్ట్ లు ఏమీ ఉండవు కదా! లెట్స్ వెయిట్ అండ్ సీ..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Complete Ban On Diwali? What Did SC Say Today?

Generally, the Supreme Court of India prefers to impose a complete ban on cracking of…

11 minutes ago

BRS Had Ten Years. Why Is KTR Praising Chandrababu Now?

KTR's praise for Chandrababu Naidu over water management in Andhra Pradesh raises a question for…

30 minutes ago