
అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని నిర్మాత వర్గీయుల నుండి బయటకు వచ్చిన సమాచారం. నిర్మాత కేఎల్ నారాయణ అసలు బాలకృష్ణను సంప్రదించలేదని, మల్టీస్టారర్ గా తెరకేక్కుతోందన్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి పుకార్లను సినీ అభిమానులు ఎవరూ విశ్వసించవద్దని నిర్మాత సన్నిహితుల నుండి సమాచారం వెలువడినట్లుగా ఒక ఆంగ్ల దినపత్రిక కధనాన్ని ప్రచురించింది.
దీంతో సంచలనాత్మకంగా మారిన బాలయ్య – మహేష్ ల మల్టీస్టారర్ పై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే! సాధారణంగా ఇలాంటి పుకార్లు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి గానీ, రాజమౌళి – మహేష్ – కేఎల్ నారాయణ కాంభినేషన్లో ఇప్పటికే ఒక సినిమా రాజమౌళి, మహేష్ ల నుండి ప్రకటన రావడంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. కానీ, ఈ ప్రాజెక్ట్ కు బాలయ్యకు సంబంధం లేదని ధృవీకరణ అయ్యింది.
Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…
Ram Pothineni is working on his first film as a writer-director, #RAPO23. He is also…