
షూటింగ్ ఇప్పటిలో ప్రారంభం కానందున, బోయపాటి నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షూట్‌ను తిరిగి ప్రారంభించాలనేది ప్రణాళిక. అయితే ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి విడుదల అనేది అంతా తేలిక కాదు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక ఫైట్ మాత్రమే షూట్ చేసింది చిత్ర బృందం.
మోనార్క్ సినిమా టైటిల్ అని పుకారు ఉంది. వీరిద్దరూ గతంలో సింహా మరియు లెజెండ్ అనే రెండు బ్లాక్ బస్టర్లను అందించడంతో ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి.
ఇటీవలే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న టీజర్ అభిమానుల అంచనాలను అందుకుంది. బోయపాటికి కూడా సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర…
Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…