బాలయ్య ఏంటిది ? అంటున్న ఫ్యాన్స్

balakrishna boyapati srinu movie akhanda release tension in fansథియేటర్స్ లోకి ఓ పవర్ ఫుల్ మాస్ సినిమా వచ్చి చాలా నెలలవుతోంది. క్రాక్ తర్వాత మళ్ళీ అలాంటి కమర్షియల్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మాస్ ఆడియన్స్ కి ప్రస్తుతం దగ్గరలో కనిపిస్తున్న సినిమా ‘అఖండ’ ఒక్కటే. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. దీంతో త్వరలోనే బాలయ్య -బోయపాటి మాస్ కాంబో థియేటర్స్ లో చూడొచ్చని నందమూరి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా OTT లో చేస్తున్న టాక్ తో బిజీ అయిపోయాడు బాలయ్య.

నిజానికి ఓటీటీ వర్సెస్ సినిమా థియేటర్స్ అనే టాపిక్ వస్తే బాలయ్య ప్రియారిటీ సినిమాకే. ఈ విషయాన్నీ ఇటివలే కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు కూడా. కానీ ఇప్పుడు బాలయ్య తీరు మారినట్టు కనిపిస్తుంది. రిలీజ్ వరకు వచ్చిన సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ చెప్పకుండా దానికి సంబంధించి ప్రమోషన్ మొదలు పెట్టకుండా ఇప్పుడు ఉన్నట్టుండి తన టాక్ షోని హైలైట్ చేసుకుంటున్నాడు.

ADVERTISEMENT

ఇటివలే బాలయ్య టాక్ షో గ్రాండ్ లాంచ్ చేసి ప్రమోషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రోమో కి సంబందించిన స్టిల్స్ బయటికి వదిలారు. బాలయ్య సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఫోకస్ ఇప్పుడు ఈ టాక్ షో వైపుకి మళ్ళింది. ఒక వైపు బడా హీరోలంతా తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి వాటిపై ప్రేక్షకుల దృష్టి పడేలా ప్లాన్ చేసుకుంటుంటే బాలయ్య మాత్రం నా రూటే సెపరేటు అంటూ సినిమాను పక్కన పెట్టేసి టాక్ షోతో హంగామా చేస్తున్నాడు. మరి బాలయ్య ఇలాగే టాక్ షోతో హంగామా చేస్తూ అఖండ ను పక్కన పెడితే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి తగ్గడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories