
“ఆ రోజు థియేటరు వద్దకు బాలకృష్ణ వస్తున్నారని తెలుసుకుని ఓ వీరాభిమానిగా అక్కడికి వెళ్లానని, బాలయ్య తనకు దగ్గరగా రావడంతో ఫోటో తీసుకునేందుకు ఉత్సాహపడ్డానని, ఈ క్రమంలో ఆయన కాలును పొరపాటున తాను తొక్కానని, ఆ బాధలో బాలయ్య తనను నెట్టడంతోనే నా చేతిలోని ఫోన్ కిందపడి పగిలిందని” తెలిపాడు. ఈ ఘటనను వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఘటనను యాంటీగా చూపించారని ఆరోపించాడు.
నిజానికి అక్కడ జరిగింది ఒకటైతే, మరో కథను ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. సినిమా హిట్ అయిందని, కలెక్షన్లను ఆపలేక ఇలాంటి ప్రచారం సాగిస్తున్నారని విమర్శించాడు. బాలయ్య బాబు అంటే తనకెంతో అభిమానమని, అదే రోజు మరో థియేటరు వద్ద బాలయ్యతో కలసి తాను సినిమా చూశానని, అప్పుడు ఫోటో కూడా దిగానని చెప్పాడు. తమ హీరో ఎంతటి మంచి వ్యక్తో తనకు తెలుసునని, ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మక్కర్లేదని అభిమానులకు పిలుపునిచ్చాడు.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…