
“మార్చేయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ ఓ పేరు మాత్రమే కాదు
ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..” అంటూ బాలయ్య వైసీపీ ప్రభుత్వంపై పేస్ బుక్ లో విరుచుకుపడ్డారు. నందమూరి కుటుంబంలో మిగిలినవారు ఈ వివాదంపై చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారు కానీ భయం అనే మాటకు అర్దమే తెలియని బాలయ్య మాత్రం ఈవిదంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీని వలన భవిష్యత్లో విడుదలకాబోయే తన సినిమాలకు వైసీపీ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తుందని తెలిసి ఉన్నప్పటికీ బాలయ్య ఏమాత్రం తగ్గలేదు. అఖండ సినిమాను దెబ్బ తీయడానికి వైసీపీ ప్రభుత్వం విఫలయత్నాలు చేసింది కానీ ఏమీ చేయలేకపోయింది. కొత్తగా ఇంకేమి చేయగలదు?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…
ఆలస్యం అమృతం విషం, అలాగే నిదానమే ప్రధానమనే రెండు మాటలు వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు వివిధ కారణాలతో ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం…