
Hyderabad Metro Losses Raise AP Concerns
ఆలస్యం అమృతం విషం, అలాగే నిదానమే ప్రధానమనే రెండు మాటలు వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు వివిధ కారణాలతో ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం చేస్తున్నకొద్దీ వాటి అంచనా వ్యయాలు అమాంతం పెరిగిపోతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన భారీగా నష్టం వస్తుంది.
ఏపీ విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులు నిర్మించాలనుకుంది. కానీ వివిధ కారణాలతో రెండూ ఇంతవరకు ప్రారంభమే కాలేదు.
కానీ హైదరాబాద్లో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణికులతో మెట్రో రైళ్ళు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులలో హైదరాబాద్ మెట్రోకు ఈ అర్ధ సంత్సరంలో ఏకంగా రూ. 405 కోట్లు నష్టాలు వచ్చినట్లు ప్రకటించింది! గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో రూ.25 కోట్లు పైనే నష్టాలు వచ్చాయి.
హైదరాబాద్ మెట్రో నష్టాలు చూస్తునప్పుడు, ఏపీ మెట్రో ప్రాజెక్టులు ఆలస్యం అవడం ఓ విధంగా రాష్ట్రానికి మేలే జరిగిందనిపించక మానదు.
హైదరాబాద్ మెట్రోకు నగరంలో పలుచోట్ల వేలకోట్ల ఖరీదు చేసే భూములున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. పైగా రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయినా నష్టాల ఊబిలో కూరుకుపోతూనే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకొని దాని అప్పులన్నీ తీర్చేసి లాభాల బాట పట్టించాలని ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఆరు నెలల్లోనే 405 కోట్లు నష్టాలు వచ్చాయి. మరో ఆరు నెలల్లో అవి రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏపీ మెట్రో ప్రతిపాదనలను ఆమోదించి ఉండి ఉంటే, అప్పుడు ఏపీ మెట్రో ప్రాజెక్ట్ చేపట్టి నిర్వహించబోయే సంస్థపై కూడా ఇలాగే భారం పడుతుంది. అప్పుడు అది చేతులెత్తేస్తే, ఆ భారం ఏపీ ప్రభుత్వంపై పడుతుంది కదా?
దేశంలో అనేక నగరాలలో మెట్రో నిర్మించి ‘మెట్రో గురూ’గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్ మెట్రో నిర్మాణం, నిర్వహణ ఎన్నడూ లాభదాయకం కాదని మొదటే చెప్పారు. దాని బదులు తక్కువ నిర్మాణ, నిర్వహణ ఖర్చయ్యే ఎంఎంటిఎస్ రైళ్ళను ఏర్పాటు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
అయితే ఏపీ ప్రభుత్వం మెట్రోకే మొగ్గు చూపినా వివిధ కారణాల వలన అది సాధ్యపడలేదు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నష్టాలు చూస్తున్నప్పుడు ఏపీ మెట్రో ఆలస్యం కావడం కూడా మన మంచికేనని సరిపెట్టుకొని, శ్రీధరన్ సూచన పాటించవచ్చు లేదా అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించినా చాలు. ప్రజలు చాలా సంతోషిస్తారు.
Ramayana, starring Ranbir Kapoor, Yash and Sai Pallavi, is set to have its world premiere…
Sambarala Yeti Gattu (SYG), starring Sai Durgha Tej, has completed its shooting. The makers have…