Telugu

బాలయ్య-ఎన్టీఆర్ సినిమా చేస్తే?.

కూటమి ప్రభుత్వంలో, పార్టీల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి కనుక పాలకులు, పార్టీలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండక తప్పదు.

అలాగే అవకాశం చిక్కితే నందమూరి కుటుంబంలో, నందమూరి-నారా కుటుంబాల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. కనుక రెండు కుటుంబాల సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండక తప్పదు.

ADVERTISEMENT

ఇటీవల ‘రా ఎన్టీఆర్’ పేరుతో జరిగిన వివాదం ఇందుకు ఓ చక్కటి ఉదాహరణగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరుతో ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాటి గురించి వివరణ ఇచ్చేందుకు ఆ సంస్థ నిర్వాహకుడు తిరుపతిలో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడిన మాటలు అందరూ విన్నారు.

కనుక ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నప్పటికీ, అయన పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘రా ఎన్టీఆర్’కి అటువంటి ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. కానీ దాని చుట్టూ రాజకీయాలు జరిగాయి కదా?

అయితే కూటమి పార్టీల మధ్య, ఎన్టీఆర్, నారా కుటుంబాల మద్య చిచ్చు పెట్టేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని షూటింగ్‌లో బాలయ్య గాయపడినప్పుడు మరోసారి స్పష్టమైంది.

ఆయన గాయపడినట్లు తెలియగానే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ తదితరులు ఫోన్ చేసి పరామర్శించారు. వారు ముగ్గురూ రాజకీయాలలో ఉన్నారు కనుక ఇలాంటి పరామర్శలు సర్వసాధారణమే.

కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూ.ఎన్టీఆర్ వెంటనే ‘బాల బాబాయ్ త్వరగా కోలుకొని మళ్ళీ సింహంలా గర్జించాలంటూ’ ట్వీట్‌ చేశారు.

వారిరువురూ ఎవరి సినిమాలతో వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈ చిన్న ట్వీట్‌ వారి మద్య ఉన్న అనుబందం చెక్కు చెదరలేదని స్పష్టం చేస్తోంది. ఈ విషయం వైసీపీ శ్రేణులతో పాటు బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు కూడా గ్రహిస్తే బాగుంటుంది. అభిమానులు కూడా ఏకం కావాలంటే బాలయ్య-ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేయాలేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

1 hour ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

2 hours ago