Telugu

బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ‘బాస్’ ఫోటో!

మెగా హీరోలపై ఒకప్పటి కమెడియన్, ప్రస్తుత నిర్మాత బండ్ల గణేష్ కురిపించే ప్రేమ తెలియనిది కాదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు అభిమానులకు మాంచి కిక్ నిస్తుంటాయి. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలలో బండ్ల గణేష్ వ్యాఖ్యల కోసమే అభిమానులు ఎదురు చూసారంటే అతిశయోక్తి లేదు. అలా పవన్ పై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించే బండ్ల, తాజాగా తిరుపతిలో జనసేన మీటింగ్ పై ఓ ఫోటోను పోస్ట్ చేసారు.

“బతిమాలితే పనులు జరగవు! బలం చూపిస్తేనే జరుగుతాయి! యూ ఆర్ రైట్! బాస్” అంటూ పవన్ కు మద్దతు పలికిన బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ఫోటో అభిమానుల్లో మరోసారి ఉత్తేజాన్ని నింపుతోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక పండు ముసలావిడ టివికి అతుక్కుపోయి, పవన్ మాటలు వింటున్న విధంగా ఉన్న ఈ ఫోటోను చూస్తూ పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తమ హీరోకు ఉన్న ప్రజాబలానికి నిదర్శనమంటూ పండగ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sandeep Reddy Failed For 1st Time?

Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…

17 minutes ago

Can Mythri Fix Tollywood’s Small Film Problem?

Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…

47 minutes ago