
ఆ సమయంలో తన కుడి చేతిలో మొబైల్ ఫోన్, మరో పుస్తకాన్ని పట్టుకుని ఉన్న బెన్, ఎడమ చేతితో ఆమెను పక్కకు నెట్టాడు. అంతవరకూ ఓకే, అయితే ఆ చెయ్యి పడిన ప్రాంతమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనుకోకుండానే జరిగినా, ఆ యువతి గుండెలపైనే బెన్ చేయి పడటంతో, అది లైవ్ లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఈ ఘటన తరువాత సదరు యువతి సైతం లైట్ గా తీసుకుంటూ, బెన్ భుజంపై ఓ మారు తట్టి వెళ్లిపోయింది. కానీ, సోషల్ మీడియాలో ఇది రచ్చగా మారడంతో బెన్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
దీంతో బెన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ… ఇది దురదృష్టవశాత్తూ జరిగిందని, కావాలని చేసింది కాదని, ఇంటర్వ్యూ మధ్యలో అంతరాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ బెన్ తీరుపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు బెన్ పై మండిపడుతుండగా, బెన్ ను అభిమానించే వారు మాత్రం, తెలియకుండా జరిగిన దానికి, ఆయన తప్పేముందని సమర్ధించే పరిస్థితి నెలకొంది. మరి ఎవరిది ఎంతవరకు వాస్తవమో గానీ, ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!
India head coach Gautam Gambhir has responded to the questions over Vaibhav Sooryavanshi's place in…
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…