
ఇదిలా ఉంటే ఈ సినిమా కధలో ఓ గంట నిడివి గల సమయాన్ని ఎడిట్ చేసామన్న విషయాన్ని స్వయంగా కొరటాల శివ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ కావడంతో ఎడిట్ చేసిన కొన్ని సీన్లను జోడించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. హోలీ నేపధ్యంలో తీసిన యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలకమైన సీన్లను కలిపి దాదాపుగా ఓ 15 నిముషాలు నిడివి గల సన్నివేశాలను కలపాలని యోచిస్తున్నారట.
అయితే ఇది ఎప్పుడు జోడిస్తారోనని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. రెండవ వారం ముగిసిన తర్వాత ఈ సీన్స్ ను యాడ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్ గనుక, ఇతర భాషల్లో ఈ సినిమాను డబ్ చేస్తున్నామని, వాటితో పాటు హిందీలో కూడా డబ్ చేస్తామని కొరటాల శివ స్పష్టం చేసారు. దీంతో మహేష్ మరికొన్ని భాషల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడన్న మాట.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…