
అందులోనూ ప్రిన్స్ మహేష్ బాబు యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ప్రిన్స్ అభిమానులతో పాటు, సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తిని పెంచుతోంది. దీనికి తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాలు, అలాగే ఇంటర్వెల్ ముగిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో కొరటాల తీర్చిదిద్దారన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ ను మొదటిసారిగా ఊర మాస్ లెవల్లో చూపించబోతున్నారని జరుగుతోన్న ఈ పబ్లిసిటీ అప్పుడే అవసరమా?
చిత్ర యూనిట్ పని కట్టుకుని ఈ ప్రచారం చేయించకపోయినప్పటికీ, సినిమా కధ తెలిసిన చిత్ర యూనిట్ సభ్యుల ద్వారానో, ఇంకో మార్గం ద్వారానో, ఇటీవల సినిమాల థీమ్ బయటకు వచ్చేస్తోంది. గతంలో ‘జై లవకుశ’ కధ గురించి ఇలాగే భారీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే కనీసం షూటింగ్ కూడా మొదలు పెట్టకముందే, ఈ రేంజ్ లో ఊదరగొడితే, సినిమా పూర్తయ్యే నాటికి పరిస్థితి తారాస్థాయికి చేరుకొని, అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల వలన భారీ ఫ్లాప్ లు చవిచూసిన అనుభవాలు తెలుగు సినిమాకు కొత్తమీద కాదు.
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…