
[m9ad]
తాజాగా ఈ సినిమా బుల్లితెరపై మరికొద్ది గంటల్లో ప్రదర్శితం కానుంది. దీంతో అందరి కళ్ళు ఈ సినిమా టీఆర్పీ రేటింగ్స్ పైకి మళ్ళాయి. ఇటీవలే “రంగస్థలం” సినిమా బుల్లితెరపై ప్రదర్శితం కాగా, రికార్డు స్థాయిలో 19.5 టీఆర్పీని సొంతం చేసుకుని రామ్ చరణ్ అదరగొట్టాడు. మరి అదే స్థాయిలో రేటింగ్స్ ను ప్రిన్స్ సొంతం చేసుకోగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నిజానికి రామ్ చరణ్ తో పోలిస్తే బుల్లితెరపై మహేష్ సినిమాలకు ఎక్కువ ప్రేక్షకాధరణ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ రూపంలో డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తుండడంతో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ‘రంగస్థలం’కు వచ్చిన రేటింగ్స్ అద్వితీయంగా నిలిచాయి. మరి ఆ స్థాయిలో ‘భరత్ అనే నేను’కు ప్రేక్షకులు పట్టం కడతారో లేదో చూడాలి.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…