
తొలిరోజు ప్రీమియర్స్ నుండి మొదలైన ఈ పోటీలో వరుసగా 9 రోజుల పాటు మహేష్ ‘భరత్ అనే నేను’దే ఆధిపత్యం. అయితే 10 రోజులు ముగిసే సమయానికి ‘రంగస్థలం’ మొదటిసారిగా ఓవర్సీస్ లో తన ప్రభావాన్ని చాటుకుంది. తొలి 10 రోజులు ముగిసిన తర్వాత ఈ రెండు సినిమాల కలెక్షన్స్ బయటకు వచ్చాయి. అందులో భాగంగా 61కే డాలర్స్ తో ‘భరత్’పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
ప్రీమియర్స్ తో కలిపి మొదటి పది రోజులకు గానూ సుకుమార్ – రామ్ చరణ్ ల ‘రంగస్థలం’ 3.21 మిలియన్ డాలర్స్ ను కైవసం చేసుకోగా, కొరటాల – మహేష్ బాబుల ‘భరత్ అనే నేను’ 3.15 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ గా ‘రంగస్థలం’ 3.50 మిలియన్ డాలర్స్ వద్ద క్లోజ్ అవుతుండగా, ‘భరత్ అనే నేను’ కూడా దాదాపుగా అదే సంఖ్యను రీచ్ అవుతుందేమోనన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, which was released in…
Manasa Varanasi brings soft-focus glamour to a garden setting and makes every frame feel fresh,…