Telugu

పాత పాట మరిచి క్రెడిట్ చోరీ అంటే జనం నవ్వరూ?

శనివారం భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతోంది. కూటమి ప్రభుత్వం దీనిని చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

అయితే ఇది కూడా మా పద్దులోదే. కానీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ వైసీపీ సొంత మీడియాలో అప్పుడే పెద్ద స్టోరీ వేసేసింది.

ADVERTISEMENT

నాడు సిఎం చంద్రబాబు నాయుడు దీనికి భూసేకరణ చేసి, కేంద్రం నుంచి అనుమతులు సాధించి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ‘వైజాగ్‌లో ఇంత పెద్ద విమానాశ్రయం ఉన్నప్పుడు ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం దేనికి?” అని జగన్‌ ప్రశ్నించారు.

అసలు భోగాపురం వద్ద విమానాశ్రయమే అవసరం లేదని చెప్పిన జగన్‌, నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అక్కడే ఎందుకు శంకుస్థాపన చేసినట్లు? అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన అర్థం చేసుకోవడానికి ఆయనకు నాలుగేళ్ళు పట్టినందునా?

“దేశంలో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలను కేవలం 1,200 ఎకరాలలో నిర్మిస్తే, భోగాపురం విమానాశ్రయానికి 5,000 ఎకరాలు దేనికి?” అని నాడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

కానీ జగన్‌ సిఎంగా ఉన్నప్పుడు 2,750.78 ఎకరాలు భూసేకరణ చేసి శంకుస్థాపన చేశారని వైసీపీ సొంత మీడియా గొప్పగా చెప్పుకుంటోంది.

విమానాశ్రయానికి 1,200 ఎకరాలు చాలనుకున్నప్పుడు 2,750.78 ఎకరాలు భూసేకరణ ఎందుకు చేసినట్లు?అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు ఆలోచనలో సగం మాత్రమే అర్థమైనందున అని అనుకోవాలేమో?

ఖర్మకాలి ఒకవేళ ఈ విమానాశ్రయం భోగాపురం బదులు గోదావరి, కృష్ణా లేదా మరో జిల్లాలో ఉండి ఉంటే దీనిని కూడా జగన్‌ అమరావతిలా నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసేవారే.. కదా?

కానీ సంక్షేమ పధకాలతో, రాజకీయ కక్ష సాధింపులతో నాలుగేళ్ళు గడిపేసిన తర్వాత, కనీసం ‘విశాఖ రాజధానితోనే- ఉత్తరాంద్ర అభివృద్ధి’ అనే తమ వాదనలు నిజమని నిరూపించుకునేందుకో లేదా ప్రజలను నమ్మించి ఓట్లు రాల్చుకునేందుకో భోగాపురం విమానాశ్రయం పనులు మొదలుపెట్టారనే విషయం ప్రజలందరికీ తెలుసు.

ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిలాగే ఆలోచించి, జగన్‌ మొదలుపెట్టిన ఈ పనులు నేనెందుకు కొనసాగించాలి? అనుకొని ఉంటే భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు అయ్యేదా? రేపు ప్రారంబోత్సవం అయ్యేదా?

కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనుకుంటారు. కనుకనే శరవేగంగా పనులు పూర్తిచేయించారు. దీంతో వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ‘క్రెడిట్ చోరీ’ పాట మొదలెట్టేశారు.

కానీ మనం ఈ పాట పాడుతుంటే సోషల్ మీడియాలో తాము పాడిన పాత పాటలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు మనమే నవ్వులపాలవుతామని గ్రహిస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

India Won Series: Kerala Star Shuts Down Haters

India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…

3 hours ago

BB Telugu: Eliminated In Week 1 & Re-Entry In Week 2

With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…

3 hours ago