
అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించే 24 గంటల ముందు నుంచి కౌంట్ డౌన్ మొదలైనట్లు, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం వద్ద కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ హడావుడిలో మంత్రులు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఉత్తరాంధ్రాలో అప్పుడే ఈ హడావుడి మొదలైపోయింది.
మరో పక్క వైసీపీ కూడా దీనికి కౌంట్ డౌన్ ప్రారంభించేసింది. ఈ విమానాశ్రయం మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవ వల్లనే ఏర్పాటవుతోందంటూ భూసేకరణ మొదలు నిర్వాసితులకు నష్టపరిహారం అందించడం వరకు ఆయన చేసిన కృషి గురించి సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా వర్ణిస్తోంది. జగన్ విమానాశ్రయం ఏర్పాటుకి ఎంతో’ శ్రమిస్తే చంద్రబాబు నాయుడు ఆయనకు దక్కాల్సిన క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నాడు జగన్ అన్న మాటలని వక్రీకరించి, అయన ఈ విమానాశ్రయ ఏర్పాటుని వ్యతిరేకించారని టీడీపి మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవాలు ఇవిగో. కావాలంటే ఈ సాక్ష్యాధారాలు చూడండి అంటూ ప్రజలకు సమర్పిస్తూనే ఉంది.
ఇక్కడ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ జగన్‌కు దక్కడం లేదనే బాధ కంటే ఆయన తీవ్రంగా ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతోందనే ఆక్రోశమే ఎక్కువగా కనిపిస్తోంది.
పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏపీకి తరలి వచ్చి ఏర్పాటవుతున్నప్పుడు ఇదే ఆక్రోశం. చకా చకా అమరావతి నిర్మిస్తున్నా ఇదే ఆక్రోశం.
కానీ ఇది కూడా అలాగే దేవుడి స్క్రిప్ట్ అని సరిపెట్టుకొని మౌనంగా ఉంటే చాలా హుందాగా ఉండేది కదా?
కానీ ముందే చెప్పుకున్నట్లు కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ భగ్గుమని ఇగ్నేషన్ జరిగినట్లు, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసే వరకు ఈ ఆక్రోశం కొనసాగుతూనే ఉంటుంది. చివరికి క్రెడిట్ పూర్తిగా కాలి బూడిదైన తర్వాత చల్లారుతుంది.
ఇంకా విషాదకరమైన విషయం ఏమిటంటే, అమరావతిని ద్వేషిస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు నిర్మించిన శాసనసభ, సచివాలయంలో కూర్చొని ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి, ఇక నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకి వచ్చిన ప్రతీసారి, చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన భోగాపురం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
అంతేకాదు.. వస్తూ పోతున్నప్పుడు అక్కడ శిలాఫలకంపై తాటికాయంత అక్షరాలతో సిఎం చంద్రబాబు నాయుడు పేరు కూడా కనిపిస్తూనే ఉంటుంది. దేవుడా… సీపీఆర్ చేసుకుంటే గానీ ఊపిరాడేలా లేదు!
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…