
తన దుస్తులు జారిపోయిన సన్నివేశాన్ని కూడా షూట్ చేశారని, ఆ సన్నివేశాన్ని తొలగించాలని సదరు నిర్మాతకు చెప్పి, తనకు రావాల్సిన పారితోషికం తీసుకుని వెళ్లిపోయానని పేర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ సన్నివేశాన్ని అయితే తాను తొలగించమని కోరానో, ఆ సన్నివేశపు వీడియోను ఇంటర్నెట్ లో లీక్ చేశారని, అది మూడు పోర్న్ సైట్లలోకి చేరిందని వాపోయింది. ఎడిట్ చేయని బాత్ రూమ్ సన్నివేశాన్ని యూ ట్యూబ్ లో, ఆ తర్వాత ఆయా పోర్న్ సైట్లలో చూసినట్టు తన స్నేహితులు, బంధువులు తనకు చెప్పినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, తాను చేసిన తప్పుకు భయపడిపోయిన ఉపేంద్ర కుమార్ వర్మ పారిపోయారు. తన సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, సిమ్ కార్డు కూడా మార్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు ముంబైలోని వర్సోవా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ నెల 15 వరకు పోలీసుల కస్టడీలో ఉంచనున్నట్టు వర్సోవా డిప్యూటీ కమిషనర్ పరమ్ జిత్ సింగ్ పేర్కొన్నారు. ఉపేంద్ర వర్మ నుంచి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
These days, it has become extremely common for the common public to gauge the performance…
India suffered an 87 run defeat against New Zealand in the fourth T20I at Eden…