Telugu

చంద్రబాబుకు తలపోటుగా పరిణమించిన అఖిల ప్రియ

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల ఆరోపణ. అఖిలప్రియ అరెస్ట్ కాగా ఆమె భర్త పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కిడ్నపైన వారు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు.

ADVERTISEMENT

కిడ్నపైన ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. స్వర్గీయ భూమానాగి రెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి రాజకీయ వారసురాలిగా వచ్చిన ఆమె ఇప్పుడు పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓడిపోయినప్పటికీ.. రాజకీయంగా చురుగ్గానే ఉన్నారు. ఆమెపై పలు వివాదాలు వచ్చాయి.

భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న సుబ్బారెడ్డిని చంపించడానికి ఆమె సుపారీ ఇచ్చారని సుబ్బారెడ్డి నేరుగా మీడియా ఎదుట ఆరోపించారు. ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గంలోనూ జరిగిన ఓ హత్య విషయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి తలపోటుగా పరిణమించారు.

నాగిరెడ్డి మరణం తరువాత చంద్రబాబు ఆమె చిన్న వయసైనా మంత్రిని చేశారు. నాగిరెడ్డి సీటు కూడా ఆమె కోరినట్టుగానే ఇచ్చారు. అయితే నియోజకవర్గంలోని సొంత పార్టీ వారిని కూడా కలుపుకుపోవడం, అనేక వివాదాల్లో తరచు ఇరుకోవడంతో ఆమె ఓడిపోవడంతో పాటు జిల్లాలో కూడా పార్టీని నష్టపరిచారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై చంద్రబాబు చర్య తీసుకునే సాహసం చేస్తారా?

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఓటర్లు మూర్కులు.. కానీ విజ్ఞతతో ఆలోచించాలట.. ఎందబ్బా ఇది?

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవి) నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి…

25 minutes ago

Last Festival Advantage: How Are Jailer & Ranabaali Trending?

Today happens to be the final day of the Dasara holiday season and it is…

32 minutes ago