Telugu

గేమ్ ఛేంజర్ ముందు పెద్ద టాస్కులు..భారీ టార్గెట్లు..!

ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నపటికి ఆ సినిమాల ప్రమోషన్ లో మాత్రం హీరోలు వెనకడుగు వేస్తున్నారా.? లేక నిర్మాత, దర్శకులే అందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారా.? అన్నట్టుగా నడుచుకుంటున్నారు.

నాటి సలార్ కానీ, దేవర కానీ తమ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు ప్రమోట్ చేయడంలో కాస్త వెనకబడ్డాయనే చెప్పాలి. ఈ రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ దేవర విషయంలో సగటు హీరో అభిమానికి మాత్రం తమ హీరోని సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో చూడలేకపోయామే అనే బాధ మాత్రం అలానే మిగిలిపోయింది.

ADVERTISEMENT

అయితే తాజాగా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప మాత్రం అటు కెలక్షన్లలో నే కాదు ఇటు ప్రమోషన్లలో కూడా దుమ్ము దులిపింది. RRR తరువాత ఒక సినిమా ఈ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ సినిమా అవుట్ ఫుట్ కోసం ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ హీరో అల్లు అర్జున్ ఈ భారం మొత్తం తన భుజాన వేసుకుని దేశ వ్యాప్తంగా పుష్పను ప్రమోట్ చేసి సినిమా మీద ఉన్న అంచనాలను మరింతగా పెంచి భారీ ఓపినింగ్స్ రాబట్టుకున్నారు.

అయితే అంతకు ముందు రిలీజ్ అయినా దేవర ఎటువంటి ప్రమోషన్స్ చేయనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తగ్గేదెలా అన్నట్టుగా దుమ్ముదులిపింది. అయితే తాజాగా జరిగిన సంధ్య ధియేటర్ ఉదంతంతో రాబోయే మూవీ కి బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇక ముందు జరగబోయే సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ చాల జాగ్రత్తగా ఎటువంటి అనుకోని దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

ఇటువంటి సంఘటనలు సెలబ్రెటీలకు ఒకటి రెండు రోజుల విషాదాన్ని కలిగిస్తే ఆ బాధిత కుటుంబాలకు మాత్రం అది వారి జీవితకాలం మోయాల్సిన ఒక మోయలేని భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ దేవర మాదిరి ప్రమోషన్స్ కు నో చెపుతుందా.? లేక పుష్ప మాదిరి ప్రమోషన్స్ లో తగ్గేదెలా అంటూ దూసుకెళ్తుందా.?

ఏది ఏమైనప్పటికి సినిమా విజయం కోసం, మూవీ ని ప్రేక్షకులకు చేరువ చేయడానికి చిత్ర యూనిట్ కు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో అలాగే సెలబ్రెటీలను దగ్గర నుండి చూడాలి, వారికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే తొందరలో అభిమానులు, సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. వాళ్ళు బాధ్యతగా నడుచుకోవడం ఎంత ముఖ్యమో వీళ్ళు నిర్లక్ష్యం వహించకపోవడం కూడా అంతే ముఖ్యం.

ఇక డిసెంబర్ 21 న అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలుకాబోతున్నాయి. వీటిని కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడం, అలాగే తాజాగా జరిగిన పుష్ప ఇన్సిడెంట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు రాబట్టుకోవడం చిత్ర యూనిట్ కు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దానికి తోడు పుష్ప గేమ్ ఛేంజర్ ముందు బాక్స్ ఆఫీస్ భారీ టార్గెట్లనే ఉంచింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Who Allowed Case Against Pawan Kalyan? HC Asks

The Andhra Pradesh High Court raised serious questions over the criminal complaint filed against Pawan…

1 hour ago

ఏపీలో పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ అనకాపల్లి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ సమయంలో అందరూ వాటికి బదులు…

2 hours ago