
తొలుత తేజశ్వి కోసం సామ్రాట్ తనకిష్టమైన గడ్డం, మీసాలను తీసేందుకు అంగీకరించాడు. గణేశ్ కోసం బాబు గోగినేని రెండు కొత్తిమీర కట్టలు తిన్నారు. దీప్తి కోసం సీజన్ మొత్తం కౌశల్ తనను తాను నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకు కౌశల్ నిరాకరించడంతో దీప్తి ఎలిమినేషన్ లోకి వెళ్లిపోయింది. గీతామాధురి కోసం తేజశ్వి తనకు ఎంతో ఇష్టమైన దుప్పటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసింది. తనీష్ కోసం దీప్తి సునయన తన జుట్టును భుజాల వరకు కత్తిరించుకుంది. బాబు కోసం గీతామాధురి బిగ్ బాస్ టాటూను పర్మినెంట్గా వేయించుకుంది.
రోల్ రైడా కోసం గణేశ్ వారం మొత్తం కేవలం పండ్లు తినడంతో పాటు ఈ వారం తనకు తానుగా నామినేషన్ కు ఓకే చెప్పాడు. అమిత్ కోసం రోల్ రైడా తన జుట్టును కత్తిరించుకుని ఎర్రని రంగు వేసుకున్నాడు. భానుశ్రీ కోసం తన తలకు కట్టుకున్న స్కార్ఫ్ ను తీసేయడంతో పాటు ఇక ఎప్పటికీ కెప్టెన్గా ఉండకూడదన్న టాస్క్ కు అమిత్ నిరాకరించడంతో భానుశ్రీ ఎలిమినేషన్ లోకి ఎంటరైంది. కాగా, బిగ్ బాస్ ఎలిమినేషన్ టాస్క్ కారణంగా హౌస్ లోని అందరూ ఒకరికొకరు దగ్గర కావడం విశేషం. అయితే ఈ వారం నామినేషన్ లో మొత్తంగా దీప్తి, భానుశ్రీ, గణేష్ లు ఎంపికయ్యారు.
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…
Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…