
తాజాగా మరోసారి బియ్యపు మధుసూధన్ రెడ్డి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఫేస్ బుక్ లో అసెంబ్లీ వీడియోను పోస్ట్ చేసిన బియ్యపు, తన స్పీచ్ ను తానే ‘హిలేరియస్ ఫన్నీ స్పీచ్’గా పేర్కొన్నారు. దీంతో సదరు పోస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో మరోసారి నెటిజన్లు సందడి చేస్తున్నారు.
‘హిలేరియస్ ఫన్నీ’ అంటే అర్ధం ఎమ్మెల్యే గారికి తెలిసి ఉండకపోవచ్చని, తనకు ఇంగ్లీష్ రాదని అసెంబ్లీలోనే చెప్పారని, బహుశా ఎవరైనా చెప్తే అలా పెట్టేసి ఉంటారని నెటిజన్లు చేస్తోన్న ‘ఫన్నీ’ కామెంట్స్ కు కొదవలేదు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి గత వీడియోలు నెట్టింట బాగానే సందడి చేస్తున్నాయి.
గతంలో పిల్లలతో కలిసి నృత్యాలు చేసిన మధుసూధన్ రెడ్డి వీడియో వైరల్ అవుతోంది. ప్రజాసేవ చేయడానికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే హోదాకు బియ్యపు గారు ఎంతవరకు న్యాయం చేస్తున్నారనేది పక్కన పెడితే, ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని పంచడంలో మాత్రం వందకు రెండు వందల శాతం న్యాయం చేస్తున్నారనేది నెటిజన్ల మాటలు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…